Ponnam Prabhakar : ఇకపై లైసెన్సులు రద్దు : పొన్నం ప్రభాకర్

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు.

Update: 2025-03-23 15:04 GMT
Ponnam Prabhakar : ఇకపై లైసెన్సులు రద్దు : పొన్నం ప్రభాకర్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే(Traffic Rules Voilations) వారిపై ఇకనుండి కఠిన చర్యలు తీసుకోకున్నట్టు పేర్కొన్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు(Driving License Cancellation) చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆ తర్వాత వాటిని ఇన్నటికీ పునరుద్ధరించమని, వారు తరువాత ఏవైనా వాహనాలు తీసుకుంటే వాటికి రిజిస్ట్రేషన్లు చేయమని హెచ్చరించారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలులోకి తీసుకు వస్తుందని, ఇందుకు సంబంధించి జీవో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. మంత్రి పేర్కొన్న ఈ నిర్ణయంతో నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వహించే వారికి భారీ షాక్ తగలనుంది. ఎనిసార్లు జరిమానాలు విధించినా కొందరు తీరు మార్చుకోవడం లేదని, అలాంటి వారిపట్ల ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు.  

Tags:    

Similar News