'కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం.. వ్యక్తిగత విభేదాలు పక్కకు పెట్టండి'

కాంగ్రెస్​ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ ఆవిర్భావ సెలబ్రేషన్స్ ​చైర్మన్ ​చిన్నారెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-05-31 14:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ ఆవిర్భావ సెలబ్రేషన్స్ ​చైర్మన్ ​చిన్నారెడ్డి పేర్కొన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత విభేదాలు పక్కకు పెట్టి.. పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. లీడర్లు, క్యాడర్​ సమన్వయంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు. లోపాలు, సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

కాంగ్రెస్ ​సీనియర్​ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ.. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రతి జిల్లాలో సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్, మేధావుల కమిటీ ఛైర్మన్ ఆనంతుల శ్యామ్మోహన్, మీడియా కమిటీ కో ఆర్డినేటర్ అయోధ్య రెడ్డి, నాయకులు వినోద్ కుమార్, పాండు రంగారెడ్డి, అద్దంకి దయాకర్, మానవతా రాయ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read..

నేడు ఈడీ విచారణకు కాంగ్రెస్ కీలక నేత 

Tags:    

Similar News