Minister Seethakka : డ్రగ్స్ కు దూరంగా ఉందాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందాం : మంత్రి సీతక్క
కొత్త సంవత్సరం(New Year )లో నూతన ఆశయాలు..లక్ష్యాల(New Aspirations..Goals)తో ప్రజలంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మంత్రి సీతక్క(Minister Seethakka)ఆకాక్షించారు.
దిశ, వెబ్ డెస్క్ : కొత్త సంవత్సరం(New Year )లో నూతన ఆశయాలు..లక్ష్యాల(New Aspirations..Goals)తో ప్రజలంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మంత్రి సీతక్క(Minister Seethakka)ఆకాక్షించారు. నేరాలకు పురికొల్పే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్, పబ్స్, క్లబ్స్, గంజాయి వంటివాటితో యువత నిర్విర్యరమవుతోందన్నారు. రాష్ట్రంలో, దేశంలో అత్యాచారాలకు, నేరాలకు మత్తు పదార్ధాల వాడకమే కారణమన్నారు. సొంత జీవితాలతో పాటు ఎదుటివారి జీవితాలను నాశనం చేసుకునే మత్తు పదార్ధాలను వినియోగానికి, వ్యసనాలకు కొత్త సంవత్సరం వేళ దూరంగా ఉండాలని నిర్ణయించుకుని తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన సే టూ నో డ్రగ్స్ కార్యక్రమంలో భాగస్వామ్యమై డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు సహకరించాలని కోరారు.
డ్రగ్స్ కు దూరంగా ఉందాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. సంతోషమైన జీవితం వేరు అర్థవంతమైన జీవితం వేరని, ఆ దిశగా యువత, ప్రజలు పాటుపడాలన్నారు. ఉత్తమ కుటుంబ, సామాజిక విలువలతో జీవితంలో ముందుకెళ్లాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రాణాలమీదకు తెచ్చుకోవద్ధని కోరారు. రాష్ట్రంలో, దేశంలో అత్యాచారాలకు, నేరాలకు మత్తు పదార్ధాల వాడకమే కారణమన్నారు.