Leopard : పంట పొలాల్లో చిరుతపులి కలకలం.. తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంట పొలాల పరిసర ప్రాంతంలో గత కొద్దిరోజులుగా చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది.
దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంట పొలాల పరిసర ప్రాంతంలో గత కొద్దిరోజులుగా చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన రాములు తన వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్ళగా అక్కడ చిరుతపులి కనిపించింది. అయితే చిరుతను దూరం నుంచి తన ఫోన్‌లో రైతు వీడియో తీశాడు. విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఉండాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి ఆహారం కోసం అటవీ ప్రాంతంలో వేటాడుకుంటూ రైతుల పొలాల వద్దకు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి పంట పొలాలలో సంచరిస్తున్న చిరుతపులను బంధించి అడవిలో వదిలి పెట్టి అడవి చుట్టు కంచే ఏర్పాటు చేయాలని కోరారు.