ప్రమాద బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి.. వామపక్షాల డిమాండ్

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

Update: 2022-09-20 14:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజాపంథా, లిబరేషన్‌, ఎంసీపీఐ(యూ), ఎస్‌యూసీఐ, ఆర్‌ఎస్‌పీ, పార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శులు సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించి, సమ్మెను విరమింప చేయాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 9 నుంచి సింగరేణి వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారని, గత 12 రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని, కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాడుతున్నాయని తెలిపారు. ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని, డిమాండ్స్‌ సాధించేవరకు వారి పోరాటాల్లో పాల్గొంటామని ప్రకటించారు.

కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ కమిటీ వేతనాలు రాష్ట్ర జీవో ఎంఎస్‌ నెంబర్‌ 22 ప్రకారం జీతభత్యాలు, గని కార్మికులకు చెల్లిస్తున్న విధంగా ఒకటో కేటగిరీ జీతాల్లో సరైన ఒకటి అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. నర్సరీ సలబ్‌, ఓబీ హెల్పర్‌, వేబ్రిడ్జి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కార్మికులకు కనీస వేతనాలు బోనస్‌ అమలు పర్చాలని, పీఎఫ్‌ చెల్లించాలని, ఈఎస్‌ఐ హాస్పటల్‌ లేదా సింగరేణి వైద్యశాలల్లో కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శులు సీపీఐ కూనంనేని, సీపీఎం తమ్మినేని, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సాధినేని వెంకటేశ్వరరావు, జీ.వీ.చలపతిరావు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌ రాజేష్‌, ఎంసీపీఐ(యూ) రవి, ఎస్‌యూసీఐ మురహరి, ఆర్‌ఎస్‌పీ జానకిరాములు, పార్వర్డ్‌ బ్లాక్‌ బండ సరేందర్‌రెడ్డిలు ప్రకటన చేశారు.

Tags:    

Similar News