Yadagirigutta : యాదగిరిగుట్టలో వైభవంగా లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం(Sri Lakshminarasimhaswamy Devasthanam)లో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయ ముఖ మండపం నందు శ్రీ స్వామి వారికి లక్ష పుష్పార్చన(Lakh Pusparchana) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

Update: 2024-10-28 06:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం(Sri Lakshminarasimhaswamy Devasthanam)లో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయ ముఖ మండపం నందు శ్రీ స్వామి వారికి లక్ష పుష్పార్చన(Lakh Pusparchana) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పుష్పార్చన అనంతరం అర్చక పండితులు మంగళ హారతులివ్వగా, భక్తులు స్వామివారిని దర్శంచుకుని తరించారు.

వేకువ జామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యాభిషేకం, అర్చనలు, మంగళ నీరాజనం, అనంతరం నైవేద్య సమర్పణ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగాయి. లక్ష్మినరసింహుల నిత్య కల్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అటు కొండపైన కొలువైన శ్రీ పర్వత వర్థిని రామలింగేశ్వర ఆలయంలో సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించారు. కాగా దేవస్థానం హుండీ ఆదాయ లెక్కింపు రేపు మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో నిర్వహించనున్నారు.

Tags:    

Similar News