Lagacherla : మమ్మల్ని చంపినా.. మా భూములు ఇవ్వము.. ప్రెస్ క్లబ్‌లో లగచర్ల గ్రామస్తురాలు
మమ్మల్ని కొట్టిన, చంపిన కూడా మా భూములు ఇవ్వమని లగచర్ల గ్రామస్తులు తేల్చిచెప్పారు.
దిశ, డైనమిక్ బ్యూరో : మమ్మల్ని కొట్టిన, చంపిన కూడా మా భూములు ఇవ్వమని లగచర్ల గ్రామస్తులు (Lagacherla villagers) తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం (Somajiguda Press Club) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పలువురు లగచర్ల గ్రామస్తులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా లగచర్ల గ్రామస్తురాలు మాట్లాడుతూ.. లగచర్లలో తన కుటుంబానికి 15 ఎకరాలు భూమి ఉందని, మాకు భూములు లేవన్న వాదనలో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. మాకు కనీసం ఆ రోజు కలెక్టర్ వస్తున్న విషయం కూడా తెలియదు.. మేము ఎవరి మీద దాడి చేయలేదని తెలిపారు.
మా భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయని మమ్మల్ని భయపెడుతున్నారని, మీరు సచ్చినా సరే ఫార్మా కంపెనీ వస్తుందని మమ్మల్ని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను గర్భిణిని.. నాకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అని లగచర్ల గ్రామస్తురాలు ఫైర్ అయ్యింది. మాకు దాడి చేయాలని ఎవరు చెప్పలేదు, మా భూములు పోతున్నయ్.. అందుకే దాడులు చేస్తున్నామని వెల్లడించింది. భూములు ఇవ్వాలని కూడా మమ్మల్ని అడగలేదు.. మేము ఎందుకు భూములు ఇస్తామని లగచర్ల మహిళా రైతు ప్రభుత్వాన్ని నిలదీశారు.