NLG: రికార్డు సృష్టించిన లడ్డూ వేలం.. ఎన్ని లక్షలో తెలుసా?
నల్లగొండలో పాతబస్తీ హనుమాన్ నగర్‌లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద లడ్డు వేలం రికార్డు సృష్టించింది. గతేడాది రూ.11 లక్షలు పలికిన ఈ లడ్డూ.. ఈ సారి ఏకంగా రూ.36 లక్షలు పలికింది.
దిశ, నల్లగొండ: నల్లగొండలో పాతబస్తీ హనుమాన్ నగర్‌లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద లడ్డు వేలం రికార్డు సృష్టించింది. గతేడాది రూ.11 లక్షలు పలికిన ఈ లడ్డూ.. ఈ సారి ఏకంగా రూ.36 లక్షలు పలికింది. వేలంలో నల్లగొండ జిల్లా అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు, దళిత నాయకుడు పేరిక కరణ్ జయరాజ్ దక్కించుకున్నారు. ఈ వేలంలో బీజేపీ రాష్ట నాయకులు నాగం వర్షిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పిల్లి రామరాజు పోటీ పడిన చివరకు కరణ్ జయరాజ్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ కర్ణన్, ప్రజా ప్రతినిధులు ఆశావహులు, భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో వేలంలో లడ్డూ కొనుగోలు జరగడం వల్ల గణేష్ ఉత్సవ కమిటీ ఆనందం వ్యక్తం చేశారు.