ఆయన ముఖ్యమంత్రికి ఏం సలహాలు ఇస్తారు.. వేం నరేందర్ రెడ్డిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్, బీజేపీలు డీప్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు.

Update: 2024-01-25 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీలు డీప్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడినా గవర్నర్‌కు తప్పు కనిపించిందని.. కానీ, కాంగ్రెస్‌ విషయంలో ఆమె పూర్తి సానుకూలంగా ఉందని విమర్శలు చేశారు. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కేలా చేశారని అసహనం వ్యక్తం చేశారు. తాము అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించుకుంటే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడెలా రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించుకున్నారని ప్రశ్నించారు.

వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సలహాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు వుంటుందా? అనే అనుమానం ప్రజల్లో వుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నారని కోమటిరెడ్డి అనలేదా? కాంగ్రెస్ పార్టీకి ఒక సీఎంను ఐదు సంవత్సరాలు కొనసాగించే చరిత్ర లేదు. మా పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తారా? లేదా? అనే అంశం మీద. కాంగ్రెస్, బీజేపీ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్‌గా నడుస్తోంది.

Tags:    

Similar News