ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం.. KTR సంచలన వ్యాఖ్యలు

బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-05-09 08:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను గతంలో బీజేపీ పడగొట్టిందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చూశారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు యత్నించారన్నారు. కానీ తెలంగాణలో బీజేపీ ఆటలు సాగలేదన్నారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలన్నారు. ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి బీఆర్ఎస్‌కు వస్తుందన్నారు. మోడీతో పోరాటం రాహుల్ గాంధీ వల్ల కాదని కేటీఆర్ తేల్చిచెప్పారు.  


Similar News