6 నెలల్లో రాష్ట్రాన్ని శాసించే స్థితికి KCR.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-06 06:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల రక్తం పీల్చి పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారన్నారు. పెట్రోల్, డిజీల్ పై పన్నుల రూపంలో పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూళ్లు చేశారని ఆరోపించారు. అదానీ, అంబానీలకు రూ.14.5లక్షల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. తాను చెప్పింది తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. కరీంనగర్ స్థానంలో పోటీ కాంగ్రెస్ పార్టీతో కాదని తేల్చిచెప్పారు. మోడీ సెస్సుల రూపంలో కొత్త పన్నులు వసూలు చేశారన్నారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని కొత్త పన్నులు వసూలు చేశారన్నారు. హైవేల కోసం పన్నులు వేశామని సమర్థకుంటున్నారని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు అని ప్రశ్నించారు. హైవేలపై టోల్ వసూళ్లపై ప్రశ్నిస్తే బీజేపీ వద్ద జవాబు లేదన్నారు. బీఆర్ఎస్‌ను 10-12 సీట్లలో గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారన్నారు.


Similar News