Padayatra: రాష్ట్రవ్యాప్త పాదయాత్రపై కేటీఆర్ సంచలన ప్రకటన

సోషల్ మీడియా(Social media) వేదికగా బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన ప్రకటన చేశారు.

Update: 2024-11-01 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా(Social media) వేదికగా బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ట్విట్టర్‌లో నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర(Padayatra) చేసే విషయంపై ఆలోచిస్తా.. ప్రజల కోసం చేసేందుకు కూడా వెనుకాడను అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శాపం అని విమర్శించారు. బీఆర్ఎస్(BRS) తిరిగి అతి త్వరలో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. విపక్షాలపై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు.

అంతకుమందు ఓ రైతు వీడియోను కేటీఆర్ పోస్టు చేశారు. పొలాల్లో కన్నీరు పెడుతుంటే తెలంగాణ సీఎం మాత్రం రోత పుట్టించే కూతలతో.. డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నాడని విమర్శించారు. వర్షం కారణంగా ఐకేపీ కేంద్రంలో ఉంచిన రైతుల ధాన్యం పూర్తిగా తడిచిపోయిందని ఓ రైతు విమర్శలు చేస్తున్న వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందన్నారు. వానాకాలం వరికోతలు సాగుతున్నాయని... కానీ ఈరోజు వరకు రైతుబంధు వేయలేదని ఆరోపించారు. అకాల వర్షాలకు చాలాచోట్ల కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్ఎస్(BRS) శ్రేణుల్లో కేటీఆర్(KTR) పాదయాత్ర ప్రకటన కాస్త జోష్ నింపనుంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..