కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్!

కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-02 05:36 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఐసీసీ‌లో 25వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదలకిచ్చే పథకాలను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. కొందరి చేతిలోనే డబ్బులు ఉండేలా కేంద్రం పని చేస్తోందన్నారు.

అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో గొప్ప నాయకులందరూ గెలుపును మాత్రమే చూస్తూ అభివృద్ధిని పక్కన బెట్టారని మండిపడ్డారు. ప్రపంచంలోని ధనికుల జాబితాలో ఇండియాకు చెందిన వారుండటం కాదని పేదలకు మౌళిక వసతులు అందాల్సిన అవసరం ఉందన్నారు.  

Also Read...

సెంట్రల్ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ నో కామెంట్ 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..