మునుగోడు ఫలితంపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్!

మునుగోడు ఫలితంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మునుగోడులో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ఓటర్లు పట్టం కట్టారని అన్నారు.

Update: 2022-11-06 12:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఫలితంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మునుగోడులో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ఓటర్లు పట్టం కట్టారని అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. మునుగోడులో కేసీఆర్ నాయకత్వాన్ని, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ కు అండగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీ నాయకులను కృతజ్ఞతలు తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్గొండలో వచ్చిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా నల్గొండ జిల్లాలోని 12 సీట్లకు 12 సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో పడినట్లైందన్నారు. నల్గొండలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తూ నల్గొండ ప్రజలు కొత్తచరిత్ర లిఖించారన్నారు.

రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని మునుగోడులో ఇదే జరిగిందన్నారు. రాజకీయంగా కళ్లు నెత్తికి ఎక్కడంతో బలవంతపు ఉప ఎన్నికను మునుగోడు ప్రజలకు ఢిల్లీ బాసులు తీసుకువచ్చారన్నారు. మోడీ, అమిత్ షా అహంకారానికి మునుగోడు ప్రజలు చెంప పెట్టులాంటి తీర్పును ఇచ్చారన్నారు. మునుగోడులో బీజేపీ తరుపున తెరపై రాజగోపాల్ రెడ్డి కనిపించినా తెరవెనుక ఉండి నడిపించింది మాత్రం మోడీ, అమిత్ షానే అని ఆరోపించారు. నిజానికి టీఆర్ఎస్ అభ్యర్థికి మరింత మెజార్టీ రావాల్సి ఉండాల్సిందని కానీ మునుగోడులో గెలిచేందుకు ఢిల్లీ పెద్దలు డబ్బుమయం చేశారని, పెద్ద ఎత్తున మనీ, మద్యం పంచారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన మొదటి రోజే బీజేపీ నేతలు డబ్బులతో పట్టుబడ్డారని చెప్పారు.

Read more :

మీరు గుద్దిన గుద్దుకు చెక్కరొచ్చింది: మంత్రి కేటీఆర్

Tags:    

Similar News