కేసీఆర్‌ను బోనులో వేసి బంధిస్తానన్న రేవంత్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!

దావోస్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.

Update: 2024-01-20 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: దావోస్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం.. కానీ వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి లాంటి అహంకారులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో అనేక మందిని చూసిందని అన్నారు.

సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించినందుకు, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చింనందుకు, ఇచ్చిన హామీలను సమగ్రంగా అమలు చేసినందుకు బీఆర్ఎస్‌ను బొంద పెడుతావా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోతాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రక్తం అంత బీజేపీదే అని అన్నారు.

Read More:   లండన్‌లో రెచ్చిపోయిన CM రేవంత్.. కేసీఆర్‌ను చెట్టుకు వేలాడదీస్తానని షాకింగ్ కామెంట్స్ 

Tags:    

Similar News