KTR: 11 నెలలైనా పనులు చేపట్టరా.. కేటీఆర్ సంచలన ట్వీట్
11 నెలలైనా పనులు జరగకపోవడం ఆందోళనకరమని, గత ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: 11 నెలలైనా పనులు జరగకపోవడం ఆందోళనకరమని, గత ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు. మలక్ పేట వద్ద ఐటీ టవర్‌కు పునాది వేసిన సందర్భంగా దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11వ నెలలో అడుగుపెడుతున్నప్పటికీ మలక్‌పేట ఐటీ టవర్ పనులు ఒక్క అంగుళం కూడా కదలకపోవడం ఆందోళనకరమని అన్నారు. తాను అక్టోబర్ 2023లో ప్రతిపాదిత ఐటెక్ టవర్‌కు పునాది రాయి వేశానని.. దానిని 36 నెలల్లో పూర్తి చేయడానికి నిర్ణయించబడిందని తెలిపారు. మలక్‌పేట్, సైదాబాద్, సంతోష్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ సహా ఇతర ప్రాంతాలకు చెందిన యువకులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 50,000 ఉద్యోగాలు కల్పించడం ఈ ఐటీ పార్క్ లక్ష్యమని చెప్పారు. ఇక హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఐటి రంగాన్ని విస్తరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించేలా చూడాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబును కోరారు.