పార్టీకి షాక్ ఇచ్చిన పోచారం.. ఇదేంటీ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ట్వీట్

కేసీఆర్ వీర విధేయుడిగా, బీఆర్ఎస్ పార్టీలో పెద్దాయనగా పేరొందిన మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-06-23 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ వీర విధేయుడిగా, బీఆర్ఎస్ పార్టీలో పెద్దాయనగా పేరొందిన మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇక, ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి ఇటీవల బీజేపీలో చేరారు. కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను డిస్ క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ స్పీకర్‌ను డిమాండ్ చేసింది. ఈ వార్త క్లిప్‌ను షేర్ చేసిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలా జరిగితే బాధితుల్లా కన్నీళ్లు నదిలా ఉప్పొంగుతాయన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడితే ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలు, కపటత్వం పీక్స్‌కు చేరిందని ఫైర్ అయ్యారు. ఈ ఫిరాయింపులపై మీరేమంటారు రాహుల్ గాంధీ జీ అని ప్రశ్నించారు. 


Similar News