31‌న హుజూరాబాద్‌కు కేటీఆర్.. కొనసాగుతున్న ముందస్తు అరెస్ట్‌లు

ఈ నెల 31న మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ పర్యటన నేపథ్యంలో పలువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Update: 2023-01-30 08:44 GMT

దిశ,హుజూరాబాద్ : ఈ నెల 31న మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేటీఆర్ మీటింగ్‌కు అంతరాయం కలిగిస్తారనే అనుమానంతో సోమవారం తెల్లవారు జామున బీజేపీ నాయకుడు, చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, దళితబంధు సమన్వయ కమిటీ చైర్మన్ కొత్తూరి రమేష్, కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, కొలిపాక శంకర్, కొల్లూరి కిరణ్ కుమార్, పానుగంటి కిరణ్ కుమార్ రెడ్డి, దయాకర్, శ్రీనివాస్ , బీజేపీ నాయకులు రాముల కుమార్, గంగిశెట్టి రాజు, నల్ల సుమన్, విజేందర్ రెడ్డి తదితరులను హుజూరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని సైదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కాగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ముందస్తుగానే అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా కొత్తూరు రమేష్ మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని నియోజకవర్గంలోని అర్హత ఉన్న వారందరికీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కేటీఆర్ మీటింగ్ ఉంటే తమనెందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై హైకోర్టుకు ఆశ్రయిస్తానని రమేష్ తెలిపారు.

Read more:

మరోసారి తీవ్ర స్థాయిలో పోంగులేటి విమర్శలు.

Tags:    

Similar News