దయచేసి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు.. వరద బాదితులకు అండగా KTR

భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Update: 2024-09-01 02:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై వరదలు పోటెత్తుతున్నారు. వాగులు, వంకలు ఉప్పొంగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయంతో నిండిపోయాయి. హైవేపైకి వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పలువురు రాజకీయ నాయకులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ వర్షాలపై స్పందించి.. తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు. దయచేసి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఇంట్లో పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండని చెప్పారు. తాత్కాలిక నిర్మాణాలు లేదా ఏవైనా శిథిలమైన భవనాలకు దూరంగా ఉండండని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొని వరద బాధిత వర్గాలకు సహాయ చర్యలు అందిస్తామని తెలిపారు.


Similar News