ఎన్ కన్వెన్షన్ కూల్చొద్దంటే కేటీఆర్ సమంతను పంపాలన్నాడు : Konda Surekha
నాగచైతన్య సమంతల విడాకులు వంద శాతం కేటీఆర్ కారణంగానే జరిగాయని మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
దిశ, వెబ్ డెస్క్ : నాగచైతన్య సమంతల విడాకులు వంద శాతం కేటీఆర్ కారణంగానే జరిగాయని మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చొద్దంటే సమంతను నా దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను కేటీఆర్ వద్దకు వెళ్ళాలని నాగార్జున వాళ్ళు ఒత్తిడి చేశారన్నారు. సమంత నేను కేటీఆర్ వద్దకు వెళ్ళనంటూ నిరాకరించిందని, దీంతో తాము చెప్పింది విను..లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని, హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అని, నాగచైతన్య – సమంత విడాకులకు కూడా కేటీఆర్ కారణమన్నారు. కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్ళీళ్లు చేసుకుని సినిమాల నుంచి తప్పుకోవడానికి కూడా కేటీఆరే కారణం అని కొండా సురేఖ ఆరోపించారు. చాలా మంది హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసి వారి జీవితాలతో ఆడుకున్నాడని మండిపడ్డారు.
Read More : కేటీఆర్ హీరోయిన్లని బ్లాక్‌మెయిల్ చేసేవాడు: Konda Surekha