KTR : హిమాచల్‌ భవన్‌ జప్తుపై కేటీఆర్ సెటైర్లు

నేను చెప్పినట్లుగానే కాంగ్రెస్(Congress)పార్టీ ప్రభుత్వాలను(Governments)నడపడం లేదని.. బదులుగా సర్కస్‌ల(Circuses)ను నడుపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎద్దేవా చేశారు.

Update: 2024-11-20 07:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : నేను చెప్పినట్లుగానే కాంగ్రెస్(Congress)పార్టీ ప్రభుత్వాలను(Governments)నడపడం లేదని.. బదులుగా సర్కస్‌ల(Circuses)ను నడుపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎద్దేవా చేశారు. హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం(Himachal Congress government) ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్‌ భవన్‌ జప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది. పది గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తీర్పు అప్రతిష్ఠగా మారింది. ఈ అంశాన్ని కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఇదీ హిమాచల్ ప్రభుత్వ కథ! అధికారంలో ఉండి రెండేళ్లు సంబరాలు చేసుకున్న కాంగ్రెస్‌ చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం తన అప్పు తీర్చలేక హిమాచల్‌ భవన్‌ను కోల్పోవాల్సి వస్తోందని కేటీఆర్ విమర్శించారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం..చేతికందినన్ని అప్పులు చెయ్యడం..ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం..ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదని.. సాక్షాత్తు హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రభుత్వ తీరని, గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి మొన్న! ఎంత సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన  ఆరు హామీలను నెరవేర్చడానికి మీరు తెలంగాణలో ఏమి విక్రయిస్తారంటూ రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.

కాగా విద్యుత్తు సంస్థ బకాయిలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ భవన్ ను అటాచ్ చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అజయ్ మోహన్ గోయల్ తీర్పునిచ్చారు. ఈ భవనాన్ని వేలం వేసి, బకాయిలు తీసుకోవాలని సదరు సంస్థకు సూచించింది. తదుపరి విచారణ డిసెంబర్ 6 వరకు వాయిదా వేస్తూ.. ఆలోగా నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులను గుర్తించాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని యావద్దేశం ముందు తలదించుకునేలా చేసింది. ఈ తీర్పుపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనూప్ రతన్ స్పందిస్తూ.. హైకోర్టు ఆదేశాలను డబుల్ బెంచ్ లో సవాల్ చేశామని, వచ్చే నెల కేసు విచారణకు వస్తుందని వెల్లడించారు.

Tags:    

Similar News