ప్రశాంతమైన మెదక్ లో కమ్యూనల్ యాక్టివిటీ సిగ్గుచేటు: కేటీఆర్

మెదక్ లో చోటు చేసుకున్న ఘర్షణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

Update: 2024-06-16 07:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మెదక్ లో చోటు చేసుకున్న ఘర్షణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గడిచిన తొమ్మిదినరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలాంటి మత పరమైన ఘర్షణలో లేకుండా ప్రశాంతంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ మతపరమైన కార్యకలాపాలు లేని ప్రశాంతమైన మెదక్ పట్ణంలో ఇప్పుడు అస్తవ్యస్తంగా మారడం నిజంగా సిగ్గుచేటన్నారు.

పోలీసుల పహారాలో మెదక్:

మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ బంద్ కొనసాగుతోంది. గోవుల తరలింపు, జంతువధపై నిన్న రాత్రి మెదక్ టౌన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఈ గొడవ నేపథ్యంలో ఇవాళ మెదక్ పట్టణం బంద్ కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఇక బంద్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మెదక్ టౌన్ కు అదనపు బలగాలను తరలించి ప్రధాన కూడళ్లలో మోహరించారు. ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఎస్పీ బాల స్వామితో పాటు ఇతర పోలీస్ అధికారులు శాంతి భద్రతల పరిరక్షణ లో ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో ఉంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News