KTR: సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్‌లో కేటీఆర్ ఆసక్తికర విషయాలు పోస్ట్
లగచర్ల దాడి కేసులో రైతు హీర్యా నాయక్ బేడీల ఘటనలో సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్‌ను ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: (Lagacharla Case) లగచర్ల దాడి కేసులో రైతు హీర్యా నాయక్ బేడీల ఘటనలో సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్‌ను ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘భూమి ఇయ్యను అన్నందుకు గిరిజన రైతులను జైలులో పెట్టడం ఓకేనట, జైలులో వారిని చిత్రహింసలు పెట్టడం ఒకేనట, వారి కుటుంబసభ్యులను అర్ధరాత్రి ఇండ్ల మీద దాడి చేసి భయపెట్టడం, బెదిరించడం ఓకేనట, నెల రోజులుగా వారికీ చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డుపడటం ఓకేనట, గుండె జబ్బుతో ఉన్న పేషెంటుకు బేడీలు వేయించడం కూడా ఓకేనట, చేసే దరిద్రపు పనులు అన్ని రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశువులను చేస్తున్న (Revanth Reddy) రేవంత్, నీ నిజరూపం రాష్ట్రంలోని పేదలందరికీ తెలిసిపోయింది. ఇకనైనా క్షమాపణ చెప్పి కేసులు రద్దు చెయ్యి, రైతులను విడుదల చెయ్యి’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాగా, లగచర్ల రైతుకు గుండెపోటు వచ్చిందని, దీంతో ఆయనకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారని వార్త సంచలనం అయింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయిన విషయం తెలిసిందే.