తిహార్ జైల్లో కవితను కలిసిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు.

Update: 2024-06-14 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా, ఇటీవలే కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 21వ తేదీ వరకు ఆమె రిమాండ్‌లో ఉండనున్నారు. మరోవైపు కోర్టులో చదువుకోవడానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోరగా.. కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఈనెల 21న జరుగనుంది.


Similar News