KTR: హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకో రేవంత్: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బతినేలా సీఎం మాట్లాడొద్దంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2024-08-11 03:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బతినేలా సీఎం మాట్లాడొద్దంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘రాష్ట్రంలో రూ.9,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేలా అమరరాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని అన్నారు. ప్రభుత్వం ఓ పాలసీపై వెళ్లాలని, రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన అందరికీ సర్కార్ వివేకంతో సముచిత గౌరవం ఇస్తుందనే తాము ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన, శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉండీని కేటీఆర్ తెలిపారు. కానీ, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ సీఎం హాస్యాస్పద ప్రకటనలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణను వదిలి గుజరాత్‌కు వెళ్లిపోయిందని, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి తరలిపోయిందని అన్నారు. ఇక అమర‌రాజా కూడా వెళ్లిపోతే అది తెలంగాణ పారిశ్రామిక రంగానికి వచ్చి విపత్తులాగే తాము భావిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News