KTR: లక్షల నిర్మాణాలు మావి.. లక్షల కూల్చివేతలు మీవి: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) దృష్టి సారించింది.

Update: 2024-09-27 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) దృష్టి సారించింది. మూసీ సుందరీకరణ (Mousse beautification), ప్రక్షాళన చేసేందుకు ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency) పథకం ప్రకారం ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో 55 కి.మీ పరిధిలో మొత్తం 12వేల ఆక్రమణలను అధికారులు గుర్తించి వాటిని తొలగించే బాధ్యతను సర్కార్ ‘హైడ్రా’కు అప్పగించింది. ఈ మేరకు గురువారం మూసీ ఆక్రమణలను గుర్తించేందుకు అధికారులు మొత్తం 25 బృందాలుగా ఏర్పడి కూల్చే ఇళ్లపై పోలీసుల సహకారంతో మార్కింగ్ కూడా చేశారు.

అదేవిధంగా మూసీ నిర్వాసితలకు ప్రభుత్వం త్వరలోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వివిధ కారణాలతో గ్రేటర్ పరిధిలో నిలిచిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి.. పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు ఎంత అన్న అంశాలపై ప్రభుత్వానికి ఓ నివేదికను పంపింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ట్విట్టర్ (Twitter) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మేము నిర్మిస్తే.. మీరు కూల్చేస్తున్నారు, మాది నిర్మాణం.. మీది విధ్వంసం, లక్షల నిర్మాణాలు మావి.. లక్షల కూల్చివేతలు మీవి’ అని ఫైర్ అయ్యారు. మూసి నది సాక్షిగా అదిగదిగో మహా నగరం‌లో కేసీఆర్ (KCR) లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లని అన్నారు.

కాంగ్రెస్ విష ప్రచారాలు, అబద్ధాలు చెప్పిందని అనడానికి మరో సాక్షం ఇదే అంటూ ఎద్దేవా చేశారు. ‘కట్టలేదన్నారు.. ప్రజలను మభ్యపెట్టాం అన్నారు, మరి లక్ష ఇండ్లు రాత్రికిరాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి చిట్టి’ అంటూ కామెంట్ చేశారు. మీ పాలనలో.. మీ అధికారులే.. మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ (KCR) నిజం.. అయన హామీలు నిజం.. ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా అంటూ ఫైర్ అయ్యారు. జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు ఇవాళ కేసీఆర్ (KCR) గారి నిర్మాణాలే దిక్కయ్యాయని అన్నారు. కేసీఆర్ (KCR) లక్ష డబుల్ నిర్మాణాలు నిజం.. కేటాయింపులు నిజమని తెలిపారు. ‘మీ నాలుకలు తాటి మట్టాలు కాకపోతే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి’ అంటూ కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. 


Similar News