నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్

జక్కాపూర్ గ్రామ శివారులో రూ.476 కోట్ల వ్యయంతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

Update: 2023-03-15 08:36 GMT

దిశ, నిజాంసాగర్: నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామ శివారులో రూ.476 కోట్ల వ్యయంతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్ ప్రారంభించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, డీసీసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, బిగాల గణేష్ గుప్తా, జాజుల సురేందర్, గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదర్ శోభ రాజు, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నిజాంసాగర్ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, స్థానిక ఎమ్మార్వో నారాయణ, స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News