చిన్నారుల క్యూట్ ఆహ్వానం! మాట నిలబెట్టుకున్న కేటీఆర్

Update: 2024-03-04 12:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (ఎక్స్) ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. నెటిజన్ల వేసిన ప్రశ్నలకు స్పందిస్తారు. సమస్య ఉందంటే వెంటనే రియాక్ట్ అవుతారు. సమస్య పరిష్కారానికై కేటీఆర్ ఆఫీస్‌కు ఆయన ఆదేశాలిస్తారు.

ఇటీవల ఓ అభిమాని తన ఇంటికి ట్విట్టర్ వేదికగా ఆహ్వానించగా.. హైదారబాద్‌లోని బోడబండ వెళ్లి అభిమాని వారి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల చిన్నారులు కేటీఆర్‌ను తమ స్కూల్ ఫంక్షన్‌కు ఆహ్వానించారు. రాజేంద్రనగర్‌లోని హైదరాబాద్ మిలీనియం స్కూల్ పిల్లలు తమ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు రావాలని క్యూట్‌గా ఆహ్వానించారు.

ఇంత క్యూట్‌గా ఆహ్వానం అందడం ఇదే ఫస్ట్!

కేటీఆర్ తాజాగా వారి స్కూల్ వేడుకలకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా ఫోటోలు పంచుకున్నారు. హైదరాబాద్ మిలీనియమ్ స్కూల్ చిన్నారులకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా తనకు అనేక కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానాలు అందాయని, కానీ ఇంత అద్భుతంగా (క్యూట్‌గా) ఆహ్వానం అందడం ఇదే అంటూ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాజేంద్రనగర్ వెళ్లి మిలీనియం స్కూల్ విద్యార్థులతో గడిపారు. దీంతో కేటీఆర్ ట్వీట్ వైరల్ అయ్యింది.

Tags:    

Similar News