ఓయూలో ఉద్రిక్తత! నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్: చనగాని దయాకర్

తమ డిమాండ్లు సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-13 09:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమ డిమాండ్లు సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని, నేడు నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా నడుపుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఓయూలో నిరుద్యోగులను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా చనగాని దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కేటీఆర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ నిరసనపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాయి. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించింది కాంగ్రెస్ పార్టీ అని, మెగా డీఎస్సీ ఇస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, అమలు కానీ ఆరు గ్యారెంటీలు చేతకాక ప్రతిపక్షాలపై బురదజల్లే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందన్నారు. నిరుద్యోగులను మోసం చేసింది సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి.

Tags:    

Similar News