KTR: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే: మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్

రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు విష జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Update: 2024-08-27 04:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు విష జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వైద్య, ఆరోగ్య ఉదాసీనతపై ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెజారిటీ జిల్లాల్లో డెంగీ కేసులు వీపరీతంగా నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడు 36 శాతం డెంగీ కేసులు నమోదం అవ్వడం అందరినీ కలవర పెడుతోందని అన్నారు. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 2,65,324 మందికి జ్వరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులతో సహా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రిట్‌మెంట్‌‌కు బెడ్లు దొరకని పరిస్థితి ఉందని అక్షేపించారు. ఒక్కో బెడ్ మీద ఇద్దరు లేదా ముగ్గురికి చికిత్స అందజేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నమెంట్ దవాఖానాల్లో సరిపడా మందులు కూడా అందబాటు లేవని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిజాలు దాస్తుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తిందని కేటీఆర్ అన్నారు. 


Similar News