కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ యాక్టివ్ సీఎం: కేంద్రమంత్రి బండి సంజయ్‌

కేంద్రమంత్రి బండిసంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-08 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి బండిసంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం  మీడియా తో చిట్ చాట్(chit chat)లో పాల్గొన్న బండి.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌(KTR) యాక్టివ్ సీఎం అన్నారు. ఇరు పార్టీలు రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంప్రమైజ్‌ రాజకీయాలు(compromise Politics) చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీ(BJP)పై రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని.. బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌(congress) నేతల మాటలు జనం నమ్మరని ఈ సందర్భంగా బండి సంజయ్(Bandi Sanjay Kumar) చెప్పుకొచ్చారు.


Similar News