BJP: చేసిన పాపాలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి.. బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్
రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్(CM Revanth Reddy) సామాజిక న్యాయం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, కుల గణన(Caste Census) దేశానికి మోడల్(Model) అవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు(Rajyasabha Member) కే.లక్ష్మణ్(K.Laxman) అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్(CM Revanth Reddy) సామాజిక న్యాయం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, కుల గణన(Caste Census) దేశానికి మోడల్(Model) అవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు(Rajyasabha Member) కే.లక్ష్మణ్(K.Laxman) అన్నారు. బీజేపి రాష్ట్ర కార్యాలయం(BJP State Office)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congess Govt)పై ఫైర్ అయ్యారు. ఓబీసీ(OBC's)ల పట్ల రాహుల్ గాంధీ, తాత, ముత్తాతలు వ్యవహరించిన తీరు తెలుసుకోవాలని, రేవంత్ కు ఇంకా కాంగ్రెస్ నీళ్లు ఒంట బట్టలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీల అసమానతలకు కాంగ్రెస్ విధానాలే కారణమని ఆరోపించారు.
విద్య ద్వారానే వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయొచ్చని 1961లో నెహ్రూ(Nehru) రాష్ట్ర సీఎంలకు లేఖ(Letter To CMs) రాశారని, ఆ లేఖలో తను కుల గణన ప్రకారం రిజర్వేషన్లకు వ్యతిరేకమని(Opposite To Reservations) చెప్పారని గుర్తు చేశారు. నెహ్రూ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ లను సెకండ్ సిటిజన్స్(Second Citizens) గా చూశారని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ, రేవంత్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, తమ నాయకుల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. 16 ఏళ్లు పాలించిన ఇందిరా గాంధీ ఏనాడూ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయలేదని, చరిత్ర తెలుసుకొని చేసిన పాపాలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఎగిరేగిరి పడుతున్నారని, బీసీల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని సలహా ఇచ్చారు.
కుల గణన చివరిసారిగా బ్రిటిష్ కాలంలో జరిగిందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. రేవంత్ మీ కేబినెట్ లో ఎంత మంది బీసీ లు ఉన్నారని ప్రశ్నించారు. అలాగే కర్ణాటక(Karnataka)లో సిద్దరామయ్య ప్రభుత్వం(Siddaramaiah Govt) కుల గణన చేసి రిపోర్ట్(Caste Cesus Report) ఎందుకు బయట పెట్టలేదని, కుల గణన పేరుతో సర్వేలకు వందల కోట్లు ఖర్చు పెట్టడం మోడలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీహార్(Bihar) లో బీజేపీ -జేడీయూ ప్రభుత్వం(BJP-JDU Govt) కుల గణన చేపడమే కాక సర్వే రిపోర్ట్ కూడా బహిర్గతం చేసిందని తెలిపారు. నివేదిక అనంతరం బీహార్ లో ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచారని, పెంచిన రిజర్వేషన్ల అమలుపై మీలాంటి దుర్బుద్ధులు కోర్టుకి వెళ్లడంతో రిజర్వేషన్ల అంశం హోల్డ్ లో పడిందని లక్ష్మణ్ అన్నారు.