మరోసారి కృష్ణమ్మ పరుగులు.. సాగర్, శ్రీశైలం, గేట్లు ఎత్తివేత

కృష్ణా నది ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.

Update: 2024-10-20 03:15 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నది ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కర్ణాటకలోని పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడంతో.. అప్రమత్తమైన అధికారులు 4 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్లను ఎత్తడం, సాగర్ అటవీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండి.. గేట్ల నుంచి నీరు దూకుతుంది. దీంతో శనివారం రాత్రి 18 గేట్లను ఎత్తిన అధికారులు.. శ్రీశైలం నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండంటతో పులిచింత ప్రాజెక్టు కూడా నిండిపోయింది. దీంతో ఆదివారం ఉదయం 7 గేట్లను ఎత్తిన అధికారులు లక్షా 72 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా బ్యారేజీకి భారీగా వరద చేరుకుంటుంది.


Similar News