కోర్టు తీర్పును చెత్త చెదారం ఎలా అంటారు.. నర్సింహారెడ్డిపై క్రిశాంక్ ఫైర్

కోర్టు ఇచ్చిన తీర్పును విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా వైదొలగిన నర్సింహారెడ్డి చెత్త చెదారం ఎలా అంటారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు.

Update: 2024-07-17 12:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోర్టు ఇచ్చిన తీర్పును విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా వైదొలగిన నర్సింహారెడ్డి చెత్త చెదారం ఎలా అంటారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద నర్సింహారెడ్డి మీద చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం కోర్టు ఇచ్చిన తీర్పును చెత్త చెదారం అని అంటారని ఆయన ప్రశ్నించారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమల్ని ఎంక్వయిరీ కమిషన్ చైర్మన్ గా తప్పుకోవాలని చెప్తే చెత్త చెదారమని మీరు ఎలా అంటారని సీరియస్ అయ్యారు. మీరు దేన్ని చెత్త చెదరామని అంటున్నారని ప్రశ్నించారు. ఈ కేసు చెత్త చెదారమా, ఈ ఎంక్వయిరీ కమిషన్ చెత్త చెదారమా, తీర్పు చెత్త చెదారమా లేదా కేసీఆర్ గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్త చెదారమా అంటూ ప్రశ్నించారు. నరసింహ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.   


Similar News