అంబేద్కర్ వర్సిటీలో ఆగని ఉద్యోగుల నిరసనలు

అంబేద్కర్ వర్సిటీ(Ambedkar University)లో ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది.

Update: 2024-10-24 13:20 GMT
అంబేద్కర్ వర్సిటీలో ఆగని ఉద్యోగుల నిరసనలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : అంబేద్కర్ వర్సిటీ(Ambedkar University)లో ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. వర్సిటీకి సంబంధించిన 10 ఎకరాల స్థలాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయా(Jawaharlal Nehru University of Architecture and Fine Arts)నికి కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్సిటీ జేఏసీ(Ambedkar University JAC) నాయకులు గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్, టైం స్కేల్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనం ఎదుట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎసీ చైర్ పర్సన్ పల్లవీ కాబ్డే, కన్వీనర్ వడ్డాణం శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ మహేష్ గౌడ్, నాయకులు యాకేష్ దైద, కాంతం ప్రేమ్ కుమార్, రవీంద్రనాథ్ సోల్మన్, ఎల్‌వీకే రెడ్డి, ఎండీ హబీబుద్దీన్, రజినీకాంత్, షబ్బీర్, రాములు నారాయణరావు, రుషేంద్ర మణి, అవినాష్, కిషోర్, రాఘవేందేర్, జీ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News