జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మద్దుతగా కొండా విశ్వేశ్వరరెడ్డి నిరసన

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసనలకు ఆయన మద్దతు తెలిపారు. బుధవారం వారితో కలిసి నిరసనకు దిగారు.

Update: 2023-05-10 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసనలకు ఆయన మద్దతు తెలిపారు. బుధవారం వారితో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసనలను ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సింది పోయి.. వారి ఉద్యోగాలను రద్దు చేస్తామని బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.

కాగా రాష్ట్రంలో 12 నుంచి 15 వేల వరకు తక్కువ జీతానికి వేలాది మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. వారికి రెగ్యులర్ ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తాము మోసపోయామని, ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. 

Tags:    

Similar News