కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-10-02 12:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అలాగే కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని, కేటీఆర్ పై చేసిన ఆరోపణలపై మంత్రిపై లీగల్‌గా ముందుకు వెళ్తామని కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. అలాగే మంత్రి హోదాలో కొండా సురేఖ వ్యాఖ్యలు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.


Similar News