KomatiReddy VenakataReddy : ఓడిపోయాకే కవితకు గొల్లగట్టు గుర్తుకు వచ్చిందా? : మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy VenakataReddy).

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy VenakataReddy). ఓటమి పాలయ్యాకే కవితకు దూరాజ్ పల్లి గుర్తుకు వచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నపుడు కవిత న్యూయార్క్, లండన్ లో బతుకమ్మ ఆడింది గాని, గొల్లగట్టులో ఎందుకు ఆడలేదని ప్రశ్నించారు. జైలుకు వెళ్ళి వచ్చాక ఇప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తుకు వస్తున్నారు అన్నారు. జగన్(Jagan) తో కుమ్మక్కయ్యి శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పజెప్పిందే కేసీఆర్(KCR) అని.. అందుకే ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోయారని మండిపడ్డారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని తెలిపారు. కేటీఆర్(KTR) రాజకీయాల్లోకి రాకముందే తాము అనేక పదవులు చేపట్టామని.. కేటీఆర్ మా ముందు బచ్చ.. ఆయన మాటలకు మేము విలువ ఇచ్చేది లేదన్నారు. తాను ఐటీ మినిస్టర్ గా ఉన్నపుడు రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తెచ్చానని.. కేటీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి పేరు పొందారని.. అసలు తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ముందు నుంచి కొట్లాడింది తామేనని అన్నారు. హరీష్ రావు(HarishRao)కు లెక్కలే రావని.. ప్రాజెక్టులపై ఆయన చెప్పేవి అన్నీ అబద్దాలే అని కొట్టిపారేశారు కోమటిరెడ్డి.