Delimitation : డీలిమిటేషన్ పై కేకే కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వస్తున్న డీలిమిటేషన్(Delimitation) విధానంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు(K.Keshavarao) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వస్తున్న డీలిమిటేషన్(Delimitation) విధానంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు(K.Keshavarao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. డీలిమిటేషన్ విధానంపై అన్ని రాష్ట్రాలతో చర్చించాకే ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ విధానం ద్వారా దక్షిణాదిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరగాలి గాని తగ్గకూడదు అని ఆశించారు. పార్లమెంటు ఆమోదంతోనే చట్టం చేయాలి తప్ప, మొండిగా ముందుకు వెళ్లకూడదు అని పేర్కొన్నారు. ఇది సీట్ల గురించి పోరాటం కాదని, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉండాలన్నదే అభిప్రాయం అని తెలిపారు.
ఈ అంశంపై దక్షిణాది నేతలు అంతా ఒక్కటి కావాలని.. లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేకే వెల్లడించారు. జనాభా ప్రకారం నియోజక వర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆదాయం ఎక్కువ, జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.