కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది.

Update: 2023-07-05 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర కేబినెట్ మీటింగ్‌కు సైతం కిషన్ రెడ్డి దూరంగానే ఉండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. తాజా అంశాలపై మీడియాతో మాట్లాడేందుకు కిషన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. మంత్రిత్వ శాఖ అధికారులు ఈ రోజు కిషన్ రెడ్డి ఇంటికి సైతం రాలేదు. ఢిల్లీలోనే ఉన్నా సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ గా నియమించిన తర్వాత  ఇప్పటి వరకు కూడా కిషన్ రెడ్డి తాజా అంశాలపై స్పందించలేదు. 


Similar News