Kishan Reddy: కాంగ్రెస్ హామీలపై ప్రజలకు నమ్మకం ఏనాడో పోయింది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ హామీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Update: 2024-04-25 11:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ హామీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని ఒడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. దేశం మొత్తం ప్రధాని నరేంద్రమోడీ వైపు చూస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రుణమాఫీ అన్నారని, ఎన్నికల టైం చూసుకుని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు కావాల్సిది దేవుళ్లపై ఒట్లు కాదు.. బ్యాంకుల్లో పడున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యం కాని హామీలతో అధికారంలో వచ్చిన రేవంత్ సర్కార్‌కు ఓట్లడిగే హక్కు లేదని కిషన్‌రెడ్డి అన్నారు.  

Tags:    

Similar News