Kishan Reddy: వారి తీరు దుర్మార్గం.. స్వచ్ఛభారత్ ప్రోగ్రామ్ సందర్భంగా కిషన్ రెడ్డి ఆగ్రహం

స్వచ్ఛభారత్ ప్రజా ఉద్యమం అని కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-02 05:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్వచ్ఛభారత్ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది ఓ ప్రజా ఉద్యమం అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలందరి సహకారంతోనే దేశంలో స్వచ్ఛత సాధించగలమన్నారు. జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి బుధవారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్మికులు ఎంత పని చేసినా విజయవంతం కాలేదని ఈ విషయాన్ని గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల క్రితం ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించాక దేశంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెరిగిందన్నారు. కోట్లాది మంది ప్రజలకు హాస్పిటల్ ఖర్చు తగ్గిందని చెప్పారు. కొంత మంది చదువుకున్న వారు, అపార్ట్ మెంట్లలో ఉంటున్న వారు తమ ఇళ్లలోని చెత్తను కవర్లలో చుట్టీ రోడ్లపై పారబోస్తున్నారని ఇది చాలా దుర్మార్గం అన్నారు. స్వచ్ఛభారత్ అనేది ఒక రోజు కార్యక్రమం కాదు. వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.  


Similar News