Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను అంతం చేస్తా : కిషన్ రెడ్డి
బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మరోసారి బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలపై ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మరోసారి బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలపై ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీలను త్వరలోనే ఫినిష్ చేస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. మూసీ(Musi) ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్ళు కులగొడితే ఊరుకునేది లేదని అన్నారు. ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కాంగ్రెస్ తయారైందని.. దీనిని బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని.. ఎక్కడి వరకైనా వెళ్తామని పేదలకు న్యాయం జరిగే వరకు ఊరుకోమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుందని.. దానితోపాటు సిటీలో డ్రైనేజి వ్యవస్థను పక్కాగా ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ మాత్రం దానికి రూ.లక్షన్నర కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒకరోజు బస చేస్తామని తెలిపిన కిషన్ రెడ్డి.. ఒకరోజంతా వారి ఇళ్ళల్లోనే ఉంటామని, అక్కడే తిని, నిద్రపోతామని తెలిపారు. బీఆర్ఎస్ అవినీతిపై స్వయంగా మోడీ మాట్లాడారని.. వారి బాగోతం అంతా తమకు తెలుసు అని, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలను త్వరలోనే అంతం చేస్తామని తెలియజేశారు. హైదరాబాద్ లోని ఫ్లైఓవర్లు, ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలపై సీఎంకి లేఖ రాస్తానని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
Read More..