Kishan Reddy: మూసీ సుందరీకరణకు బీజం వేసిందే బీఆర్ఎస్.. కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మూసీ సుందరీకరణ (Mousse Beautification)కు బీజం వేసిందే బీఆర్ఎస్ (BRS) పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-03 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: మూసీ సుందరీకరణ (Moosi Beautification)కు బీజం వేసిందే బీఆర్ఎస్ (BRS) పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని బీజేపీ (BJP) ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) అప్పట్లో మూసీ సుందరీకరణకు బీజం వేసిందని కామెంట్ చేశారు. నేడు రాష్ట్రంలో అధికారం కోల్పోగానే మూసీ బెల్ట్ ఏరియాలోని నిరుపేదలు ఆ పార్టీకి గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. నిరుపేదలు నివాసం ఉంటున్న బస్తీలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇలా.. కూల్చివేతలతో సర్కార్ మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటుందా అని ప్రశ్నించారు.

పేదల ఇళ్ల కూల్చివేతల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం అందరికీ మంచి చేయాలని, ఇలా ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదని హితవు పలికారు. పేదల ఇళ్ల కూల్చివేతలకు తమ పార్టీ విరుద్ధమని అన్నారు. అదేవిధంగా అక్కినేని కుటుంబం, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళగా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అలవాటైపోయిందని ఫైర్ అయ్యారు. ఇలాంటి సంస్కృతిని కేసీఆర్, కేటీఆర్ మొదలు పెడితే.. రేవంత్ అండ్ కో కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఇలాంటి నాయకులను బహిష్కరించాలని కిషన్‌రెడ్డి అన్నారు.


Similar News