పాలేరు ఎన్నికల్లో సీపీఐ సహకారంతోనే విజయం సాధిస్తాం
ఈ నెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే.
దిశ, ఖమ్మం రూరల్ : ఈ నెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే. రూరల్ మండలంలో సీపీఐ బలంగా ఉండటంతో గురువారం పొంగులేటి రూరల్ మండలం ఏదులాపురం గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు దండి సురేష్ ఇంటికి మార్యాదపూర్వకంగా వచ్చి కలిశారు. ఎన్నికల్లో సీపీఐ సహకరిస్తే తన విజయం సునాయసనం అవుతుందని, మీ అందరికి తాను అండగా ఉంటానని శ్రీనన్న
సీపీఐ శ్రేణులకు హమీ ఇచ్చారు. స్టేట్ పార్టీ పొత్తుల నిర్ణయం మేరకు తమ మద్ధతు ఉంటుందని సీపీఐ నాయకులు తెలిపినట్లు తెలిసింది. అనంతరం ఇటీవల డెంగ్యూతో మరణించిన డాక్టర్ గోపి కుటుంబాన్ని పరామర్శించి తండ్రి సైదులును ఓదార్చారు. గోపి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్స్టేట్ యువజన నాయకుడు రాంరెడ్డి చరణ్‌రెడ్డి, మానుకొండ రాధకిషోర్, సీపీఐ నాయకులు దండి రంగారావు, చెరుకుపల్లి భాస్కర్, వెంపటి సురేందర్, మిడకంటి పెద్ద వెంకటరెడ్డి, రాంకోటినాయక్, వెంపటి రవి, అనిల్‌రెడ్డి, కిరణ్, కొనకంటి క్రిష్ణరెడ్డి తదితరులు ఉన్నారు.