నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు
నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు అని, అందుకే పిల్లలను తీర్చిదిద్దే సంపూర్ణ బాధ్యత గురువులదేనని జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి తెలిపారు.
ఖమ్మం, నవంబర్ : నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు అని, అందుకే పిల్లలను తీర్చిదిద్దే సంపూర్ణ బాధ్యత గురువులదేనని జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గురువారం పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య అధ్యక్షతన జరిగిన బాలల దినోత్సవాన్ని రాంగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత చాచా నెహ్రూ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీడబ్ల్యూఓ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బాల్యం మధురమైనదని, బాల్యాన్ని పిల్లలు స్వతంత్రంగా అనుభూతి చెందేలా విద్యా విధానం ఉండాలన్నారు. పిల్లల్లోని నిమిడీకృతమైన ప్రతిభను ఎప్పటికప్పుడు వెలికితీసి ప్రోత్సహించాలని కోరారు.
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దేలా విద్యా విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం అభినందనీయమని కొనియాడారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులను చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతికం, సైన్స్ ఎక్స్పో, ఒలింపియాడ్, స్కూల్ డే, మహనీయుల జయంతి వేడుకలు, పర్వదినాల నిర్వహణ తదితర విభాగాలలో విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ ఎదిగేలా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు.
విద్యార్థుల స్వాగత నృత్యంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ఐసీడీఎస్ సంస్థ వారు ప్రదర్శించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రదర్శన చిన్నారులను చైతన్యపరిచింది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్ ప్రదర్శనలు, దశావతారాల ప్రదర్శన, ట్రాఫిక్ సిగ్నల్స్, డిజిటల్ ఇండియా, సేవ్ గర్ల్, హెల్తీ ఫుడ్ అన్ హెల్తీ ఫుడ్, రైతు వేషధారణ, బోర్డర్లో సైనికుడు, సేవ్ ఎర్త్, మల్టీ టాస్కింగ్ ఉమెన్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ ఆటల పోటీలు, ఫాన్సీ డ్రెస్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ముఖ్య అతిథి రాంగోపాల్ రెడ్డి , పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య లు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.