శిశు విక్రయంలో సూత్రధారి వైద్యురాలే

ప్రైవేటు వైద్యశాలలో శిశువు విక్రయం జరిగిన అంశంలో అంగన్వాడీ సూపర్వైజర్ సావిత్రి ఫిర్యాదు మేరకు భద్రాచలం పోలీసులు చట్ట విరుద్ధంగా దత్తత తీసుకున్న వారి వద్దనుండి శిశువును స్వాధీనం చేసుకుని భద్రాచలంలోని బాలికా శిశు కేంద్రానికి తీసుకు వచ్చారు.

Update: 2024-02-04 15:55 GMT

దిశ, భద్రాచలం : ప్రైవేటు వైద్యశాలలో శిశువు విక్రయం జరిగిన అంశంలో అంగన్వాడీ సూపర్వైజర్ సావిత్రి ఫిర్యాదు మేరకు భద్రాచలం పోలీసులు చట్ట విరుద్ధంగా దత్తత తీసుకున్న వారి వద్దనుండి శిశువును స్వాధీనం చేసుకుని భద్రాచలంలోని బాలికా శిశు కేంద్రానికి తీసుకు వచ్చారు. బిడ్డను తీసుకుని వెళ్లమని శిశువు తల్లిని కోరగా.. తనకు పెంచుకునే స్థోమత లేదని

    తెలపడంతో శిశు కేంద్రంలోనే ఉంటుందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారి పాషా తెలిపారు. కాగా బాలిక అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చట్ట విరుద్ధంగా దత్తత విషయంలో నలుగురిపై కేసు నమోదు చేశామని, వారిలో ఏ వన్ డాక్టర్ స్పందన కాగా, ఏ 2 ప్రోత్సహించిన గోపి నందన్, ఏ 3, ఏ 4గా దత్తత తీసుకున్న ప్రవీణ్ కుమార్, పల్లవి దంపతులని సీఐ నాగరాజు రెడ్డి తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. 

Tags:    

Similar News