గోదావరి వరదలకు కుంగిన కల్వర్టు

గోదావరి వరదలకు కుంగిన కల్వర్టు

Update: 2024-09-10 06:05 GMT

దిశ, దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండలంలో కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడి, కల్వర్టుల మద్య మట్టి కొట్టుకుపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.ఎగువన నుంచి వస్తున్న వరద, కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వేగంగా పెరుగుతోంది. దీంతో భద్రాచలం – దుమ్ముగూడెం వెళ్లే ప్రధాన రహదారి మధ్యలోని తూరుబాక వద్ద ఉన్న కల్వర్టుకు గోదావరి వరద నీరు చేరడంతో ఒక పక్క కుంగిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మండల అధికారులు అప్రమత్తమై ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా భారిగేట్లు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News