ఏజెన్సీలో టెన్షన్..టెన్షన్..మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్

Update: 2024-12-02 13:30 GMT

దిశ,మణుగూరు/ పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.దట్టమైన అడవి ప్రాంతం కావడంతో గంటగంటకు ఏం జరుగుతుందోనని అడవి బిడ్డలు భయంతో వణికిపోతున్నారు.తుపాకీ సౌడ్స్ వినపడితేనే గుండెల్లో వణుకువస్తుందని గిరిజనులు వాపోతున్నారు.ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం చల్పాకలో తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలు,మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) జరగడంతో పినపాక అడవి బిడ్డలు ఒకసారిగా భయపడ్డారు.ఈ ఎన్‌కౌంటర్‌ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని తెలవడంతో పినపాక అడవి ప్రాంతాలలో కూడా ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

దీనికి తోడు నేటి నుంచి మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాలు ప్రారంభం కావడంతో గిరిజనులలో మరింత టెన్షన్ వాతావరణం మొదలైంది.ములుగు జిల్లా ప్రక్కనే పినపాక ప్రాంతం అనుకోని ఉండటంతో పినపాక పోలీసులు సోమవారం రంగంలోకి దిగి అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు.అటుగా వస్తున్న ప్రతి వాహనంను క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనదారుడి లైసెన్స్,వాహన పత్రాలు అన్ని పరిశీలించారు.అడవి బిడ్డలకు పోలీసులు అండగా ఉంటారని పినపాక సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.తమ ప్రాంతాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.వాహన తనిఖీల్లో ఎస్సై రాజేష్ సిబ్బంది కూడా ఉన్నారు.


Similar News