అక్రమార్కులకే కొమ్ముకాస్తున్న తహసీల్దార్..

మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జా కి గురవుతున్న నేపథ్యంలో

Update: 2024-12-02 14:12 GMT

దిశ, ముదిగొండ: మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జా కి గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే పట్టించుకోకవడం తో ప్రభుత్వ భూములు కబ్జాలు పరంపరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో మండల కేంద్రం ముదిగొండ తో పాటు సువర్ణపురం రెవెన్యూలోని సర్వే నెంబరు 417 లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫార్మ్ హౌస్ తో పాటు, ప్రభుత్వ భూమిని కలుపుకొని ప్రహరీ గోడ నిర్మాణం చేసి మూడు సంవత్సరాలు దాటి అయినప్పటికీ మండల రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో భూ అక్రమణదారులు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ భూమిని కలుపుకొని లే అవుట్ చేసి వెంచర్ ను ఏర్పాటు చేశారు. కోట్ల విలువచేసే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు.

అంతేకాకుండా సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములో నుండి దారి ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ భూమిని దర్జాగా అనుభవిస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జా విషయంపై దిశ పత్రికలో కథన వచ్చిన విషయం విదితమే. ఈ కథనంపై స్పందించిన మండల తాహసిల్దార్ సునీత ఎలిజబెత్ అక్రమానికి గురైన ప్రభుత్వ భూమిని సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ భూమి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులతో మాట్లాడి మీ దగ్గర ఉన్న ఆధారాలు కార్యాలయానికి తీసుకురావాలని సూచించారు. వార్త కథనంపై వివరాలు సేకరించేందుకు సోమవారం తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వివరాలు అడగగా తాసిల్దార్ వివరాలు చెప్పకపోగా విలేకరిపై మండిపడి నీకు నేను చెప్పను, నీకెందుకు చెప్పాలి, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ దూమరం లేపింది. తాసిల్దార్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో మండలం లో చర్చనీయాంశమైంది. కాగా విలేకరులపై కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోక పోగా వార్తలు రాసిన విలేకరులపై తీవ్ర వాగ్వాదానికి దిగింది.తహసీల్దార్ పనితీరుపై విలేకరులు అసహనం వ్యక్తం చేశారు.


Similar News